Anil Kapoor: భారత వాయుసేనకు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ క్షమాపణలు

- ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్
- యూనిఫాంలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఐఏఎఫ్
- ఐఏఎఫ్ అంటే తనకెంతో గౌరవమన్న అనిల్ కపూర్
‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో భారత వాయుసేన యూనిఫాం ధరించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భారత వాయుసేన (ఐఏఎఫ్)కు క్షమాపణలు చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది.
ఇటీవల విడుదలైన ‘ఏకే వర్సెస్ ఏకే’ ట్రైలర్‌లో యూనిఫాం ధరించిన అనిల్ కపూర్ అనుచిత సంభాషణలు పలికారంటూ ఐఏఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్‌లో పనిచేసే వారి ప్రవర్తన, పరిభాషకు తగ్గట్టుగా ఆ పాత్ర సంభాషణలు లేవని పేర్కొన్న ఐఏఎఫ్, వెంటనే ఆ సీన్లను తొలగించాలని డిమాండ్ చేసింది.
ఐఏఎఫ్ అభ్యంతరంపై వెంటనే స్పందించిన అనిల్ కపూర్ ఇది కావాలని చేసిన పనికాదని, జరిగిన దానికి తనను క్షమించాలని వేడుకుంటూ ట్వీట్ చేశారు. ఓ నటుడిగానే తాను యూనిఫాం ధరించానని చెబుతూ తాను ఆ వ్యాఖ్యలు చేయడం వెనకున్న కథను తెలిపారు.
కిడ్నాప్‌కు గురైన తన కుమార్తె కనబడడం లేదన్న ఆక్రోశం సంభాషణల్లో కనిపిస్తుందన్నారు. పాత్ర కోసమే ఆ డైలాగులు తప్ప తనకు కానీ, దర్శకుడికి కానీ, ఐఏఎఫ్ పట్ల ఎలాంటి చెడు అభిప్రాయం లేదన్నారు. ఎవరి మనోభావాలు గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదని, జరిగిన దానికి తనను క్షమించాలని అనిల్ కపూర్ వేడుకున్నారు.