Nagarjuna: యాపిల్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నాగార్జునకు నెటిజన్లు ఇస్తున్న సమాధానాలివి!
- సేవలు, విధానాలు ఏకపక్షమని ఆరోపణ
- పలు రకాల సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
- రెడ్ మీ యూజ్ చెయ్యి అన్నా అంటూ సలహా
హీరో నాగార్జున యాపిల్ ఉత్పత్తులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ ఉత్పత్తులను కొనాలని భావించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారి సేవలు, విధానాలు ఏకపక్షంగా ఉంటున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. నాగ్ చేసిన ఈ ఆరోపణలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు పలువురు అభిమానులు సలహాలు, సూచనలు ఇస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
"అందుకే రెడ్ మీ యూజ్ చెయ్యి అన్నా... యూజర్ ఫ్రెండ్లీ ఉంటది. యాపిల్ లు మనకి సెట్ కావులే" అని బాలూ అనే యూజర్ సలహా ఇచ్చాడు. "యిపిల్ ఫోన్లు కొనేది ప్రెస్టీజ్ కోసమో, బటర్ ఫ్లయ్ కోసమో, ప్రీతీ జోడియాక్ కోసమో కాదు బయ్యా. సేఫ్టీ కోసం. ఐఫోన్ ని 95 శాతం ఎవరూ హ్యాక్ చేయలేరు. సో... సెలబ్రిటీల పర్సనల్ డేటా కాన్ఫిడెన్షియల్ గా ఉంటదని కొనుక్కుంటారు" అని నాగచైతన్య అనే యూజర్ సమాధానం ఇచ్చాడు.
"మీరు ట్వీట్ వేసింది ఐఫోన్ నుంచే కదా" అని ఒకరు, "ఫోన్ కొంటే సోప్ డెలివరీ ఇచ్చాడా సార్?"అని మరొకరు ఇలా సెటైర్లు కూడా వేస్తుండటం గమనార్హం.