Muralidhar Rao: కేసీఆర్ నిర్ణయాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి: మురళీధరరావు

Farmers are getting loss due to Muralirao Rao

  • నియంత్రిత సాగు వల్ల రైతులు నష్టపోతున్నారు
  • రైతాంగం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది
  • రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన భారత్ బంద్ లో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పాల్గొంది. దీంతో టీఆర్ఎస్ వ్యవహారశైలిపై బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధరరావు మాట్లాడుతూ, రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను తీసుకొచ్చిందని అన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రైతుల పట్ల శాపాలుగా పరిణమించాయని చెప్పారు.

నియంత్రిత సాగు విధానం వల్ల రైతులు నష్టపోతున్నారని మురళీధరరావు దుయ్యబట్టారు. ఫసల్ భీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచి దోచుకున్నారని చెప్పారు. రుణమాఫీ చేయలేదని, సబ్సిడీలు ఇవ్వడం లేదని అన్నారు. రైతాంగం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పూర్తిగా పెరిగిపోయిందని మురళీధర్ రావు అన్నారు. కొత్త చట్టాల వల్ల తెలంగాణ రైతులు తమ పంటను మధ్యప్రదేశ్ లో అమ్ముకోవచ్చని... తాను అమ్మిస్తానని చెప్పారు. దేశంలో ఉన్న ఏ రైతైనా మధ్యప్రదేశ్ లో పంట అమ్ముకోవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News