Mohammed Siraj: ఆసీస్ ఆటగాడికి బంతి తగిలిన వేళ సిరాజ్ మానవీయ స్పందన!

Mohammed Siraj gesture gets accolades after Australian bowler injured
  • ఇవాళ సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా-ఏ ప్రాక్టీసు మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • చెలరేగిన బుమ్రా
  • బుమ్రా షాట్ కు గాయపడిన ఆసీస్ బౌలర్ గ్రీన్
  • గాయపడిన ఆటగాడికి సిరాజ్ ఆత్మీయ పరామర్శ
ఇవాళ సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. మొదట టీమిండియా బ్యాటింగ్ చేయగా, జస్ప్రీత్ బుమ్రా బ్యాట్ తో విజృంభించాడు. ఓ దశలో బ్యాటింగ్ క్రీజులో బుమ్రా ఉండగా, నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో సిరాజ్ ఉన్నాడు.

ఆసీస్ బౌలర్ కామెరాన్ గ్రీన్ బంతిని విసరగా బుమ్రా దాన్ని స్ట్రెయిట్ గా బాదాడు. బౌలర్ గ్రీన్ తన దిశగా దూసుకువచ్చిన ఆ బంతిని ఆపడంలో విఫలం కాగా, బంతి అతడి తల భాగంలో బలంగా తగిలింది. దాంతో గ్రీన్ కుప్పకూలిపోయాడు. అయితే, బుమ్రా పరుగు తీసేందుకు ముందుకు రాగా, సిరాజ్ మాత్రం బ్యాట్ కింద పడేసి పరుగు పరుగున గ్రీన్ వద్దకు వెళ్లి అతడిని పరామర్శించాడు. తాను రనౌట్ అయ్యే ప్రమాదం ఉందని తెలిసినా, మానవీయ కోణంలో స్పందించిన సిరాజ్ గాయపడిన గ్రీన్ వద్దకు వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సిరాజ్ స్ఫూర్తిని దేశాలకు అతీతంగా క్రికెట్ అభిమానులు వేనోళ్ల కొనియాడుతున్నారు.
Mohammed Siraj
Cameron Grenn
Injury
Team India
Australia-A
Sydney

More Telugu News