Farm Laws: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు రహదారుల దిగ్బంధం

Farmers protest reached to 17th day

  • నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతుల ఆందోళన
  • నేటితో 17వ రోజుకు చేరుకున్న ఉద్యమం
  • ఢిల్లీ సరిహద్దులో భారీగా బలగాల మోహరింపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ఆందోళన నేడు 17వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంతో పలుమార్లు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధించనున్నారు. టోల్ గేట్ల వద్ద రుసుము చెల్లించకుండా నిరసనలు చేపట్టనున్నట్టు రైతు నాయకులు తెలిపారు.

 మరోవైపు, రైతుల ఆందోళనకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. రైతుల హెచ్చరిక నేపథ్యంలో టోల్‌గేట్ల వద్ద, ఢిల్లీ శివారులోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అలాగే, పలు రహదారులను మూసివేశారు. రైతుల ఆందోళనకు తొలి నుంచి అండగా నిలుస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ నెల 14న పంజాబ్‌లో వేర్వేరుగా ఆందోళనలు చేపట్టనున్నాయి.

  • Loading...

More Telugu News