vaccine: వచ్చే ఏడాది అక్టోబరులోపు అందరికీ టీకాలు: అదర్ పూనావాలా
- జనవరి నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కావచ్చు
- ఈ నెలాఖరుకల్లా ఆక్సఫర్డ్ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇవ్వచ్చు
- కనీసం 20 శాతం మందికి ఇస్తే దానిపై దేశ ప్రజలకు వ్యాక్సిన్‌పై నమ్మకం పెరుగుతుంది
పలు కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తుండడంతో భారత్‌లోనూ వ్యాక్సిన్ల పంపిణీ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కావచ్చని తెలిపారు.
దేశంలో ఈ నెలఖరుకల్లా ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమయ్యే పూర్తి స్థాయి అనుమతులు పొందేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు.
దేశంలో ఏదైనా వ్యాక్సిన్ ను కనీసం 20 శాతం మందికి ఇస్తే దానిపై దేశ ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ వచ్చే ఏడాది అక్టోబరులోపు టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో ఆ సమయానికి కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు.