Narendra Modi: 1.9 కోట్ల మందికి నరేంద్ర మోదీ తరఫున ఈ-మెయిల్స్ పంపిన ఐఆర్సీటీసీ!

IRCTC Sends 19 Million Mails onbehalf of Modi

  • సిక్కులతో సంబంధాలను వివరిస్తూ 47 పేజీల బుక్ లెట్
  • హిందీ, ఇంగ్లీష్, పంజాబీ భాషల్లో ముద్రించిన బుక్ లెట్  
  • "ప్రధాని మోదీ మరియు సిక్కులతో ప్రభుత్వ ప్రత్యేక సంబంధాలు" పేరిట బుక్

సిక్కులతో తనకున్న సత్సంబంధాలను వివరిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున 47 పేజీల బుక్ లెట్ దాదాపు 2 కోట్ల మందికి అందింది. న్యూఢిల్లీ చుట్టుపక్కల ఉన్న అన్ని సరిహద్దుల్లో రైతులు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందేనని నిరసనలను ఉద్ధృతంగా చేస్తున్న వేళ, సిక్కులకు తాను అనుకూలమేనని చెబుతూ, తాను తీసుకున్న 13 నిర్ణయాలను మోదీ ఈ బుక్ లెట్ లో వివరించారు. ఈ బుక్ లెట్ ను ది ఇండియన్ రైల్వే కాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) 1.90 కోట్ల మందికి పంపించింది.

"ప్రధాని మోదీ మరియు సిక్కులతో ప్రభుత్వ ప్రత్యేక సంబంధాలు" అనే టైటిల్ తో ఈ బుక్ ఉంది. ప్రజలకు మరింత దగ్గరవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం దీన్ని రూపొందించిందని, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని ఐఆర్సీటీసీ తనకున్న 1.9 కోట్ల మందికి పైగా కస్టమర్లకు పంపింది. డిసెంబర్ 12వ తేదీతో తన మొత్తం డేటాబసేస్ లోని పాసింజర్ల ఈ-మెయిల్స్ కు దీన్ని పంపింది. ఈ ఈ-మెయిల్ ను కేవలం సిక్కులకు మాత్రమే పంపించలేదని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

"ఈ మెయిల్ ను అందరికీ పంపించాము. ఏ వర్గాన్ని ప్రత్యేకించి చూడకుండా పంపాము. ఇలా కస్టమర్లు అందరికీ మెయిల్ పంపడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మెయిల్స్ పంపించాము" అని పేర్కొంది. ఈ బుక్ లెట్ ను డిసెంబర్ 1న కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, హర్దీప్ సింగ్ పురిలు గురునానక్ జయంతి సందర్భంగా విడుదల చేశారు.

  • Loading...

More Telugu News