Solar Eclipse: నేడు ఈ సంవత్సరం ఆఖరి గ్రహణం... ఇండియాలో మాత్రం కనిపించదు!

Last Solar Eclips of this Year Today

  • వృశ్చిక, మిధున రాశుల్లో సంభవం
  • సాయంత్రం 7.03కు మొదలు
  • అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో కనిపించనున్న గ్రహణం

ఈ సంవత్సరపు ఆఖరి సూర్య గ్రహణం నేడు వృశ్చిక, మిధున రాశుల్లో సంభవించనుంది. సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు మొదలయ్యే గ్రహణం రాత్రి 12.23 గంటల వరకూ ఉంటుందని పండితులు వెల్లడించారు. అయితే, ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. గ్రహణం కనిపించని చోట దాని ప్రభావం ఉండబోదని పండితులు తెలిపారు.

ఇక ఈ గ్రహణం అంటార్కిటికా, అట్లాంటిక్, దక్షిణ అమెరికా, దక్షిణా ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. దీని తరువాత వచ్చే సంవత్సరం తొలి సూర్య గ్రహణం జూన్ 10న ఏర్పడనుంది. ఇది ఇండియాలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. ఆపై డిసెంబర్ 4న మరో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఇండియాలో కనిపించదు.

  • Loading...

More Telugu News