Facebook: ఫేస్ బుక్ ప్రేమతో గుండెలపై పచ్చబొట్టు... ప్రేయసి కాదనడంతో ఆత్మహత్య!

Youth Sucide on Railway Trak Over Love Facebook Love Failure
  • ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వంశీకృష్ణ
  • ప్రేమగా మారిన ఫేస్ బుక్ పరిచయం
  • యువతి కాదనడంతోనే ఆత్మహత్య
అతని పేరు వంశీకృష్ణ... వయసు 22. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి సికింద్రాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (20) సామాజిక మాధ్యమమైన ఫేస్ బుక్ లో పరిచయం అయింది. ఆమె ఓ బ్యాంకులో పనిచేస్తోంది. ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ప్రేమించుకున్నారు. తన ప్రేమను ఆమెకు తెలిపేందుకు ఆమె చిత్రాన్ని తన గుండెలపై టాటూగా కూడా వేయించుకున్నాడు వంశీకృష్ణ,.

ఈలోగా ఏమయిందో ఏమో... ఇద్దరి మధ్యా విభేదాలు ఏర్పడ్డాయి. నువ్వు నాకొద్దంటూ ఆమె దూరమైంది. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురై, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆల్వాల్ సమీపంలోని భూదేవి నగర్ పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్ పై జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం... సోమవారం నాడు డ్యూటీ నిమిత్తం ఆఫీసుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పిన వంశీకృష్ణ, నేరుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా కనిపించాడు.

అంతకుముందు ఆదివారం నాడు తన స్నేహితుల వద్దకు వెళ్లి, కాసేపు గడిపాడని పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. ప్రియురాలితో వచ్చిన విభేదాలే అతని ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, మరిన్ని వివరాల కోసం లోతుగా విచారిస్తున్నారు.
Facebook
Love
Sucide
Hyderabad
Railway Track

More Telugu News