Rahul Gandhi: నిరసన తెలుపుతోన్న రైతులు కేంద్ర సర్కారుకి ఖలిస్థానీలుగా కనిపిస్తున్నారు: రాహుల్ గాంధీ

rahul gandhi slams modi govt

  • నిరసన తెలుపుతోన్న విద్యార్థులను దేశ వ్యతిరేకులు అంటారు
  • ఆందోళనలు తెలుపుతున్న పౌరులు అర్బన్ నక్సల్స్‌గా కనపడుతున్నారు
  • దేశంలో అత్యాచార బాధితులు ఎవరూ లేనట్లు కేంద్రం వ్యవహరిస్తోంది
  • ఆశ్రిత పెట్టుబడిదారులుమాత్రం మోదీ సర్కారుకి ఆప్త మిత్రులుగా కనిపిస్తుంటారు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ ఎన్డీఏ సర్కారు వారి డిమాండ్లకు అంగీకరించట్లేదన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ఆందోళనలు చేస్తోన్న వారి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వం చూపిస్తోన్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

నిరసన తెలుపుతోన్న విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి దేశ వ్యతిరేకులుగా కనిపిస్తారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అలాగే, ఆందోళనలు తెలుపుతున్న పౌరులు కేంద్ర సర్కారుకి అర్బన్ నక్సల్స్‌గా, వలస కార్మికులు కరోనా క్యారియర్లుగా కనపడుతున్నారని చెప్పారు.

అంతేగాక, దేశంలో అత్యాచార బాధితులు ఎవరూ లేనట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. నిరసన తెలుపుతోన్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి ఖలిస్థానీలుగా కనిపిస్తున్నారని విమర్శించారు. అయితే, ఆశ్రిత పెట్టుబడిదారులు మాత్రం మోదీ సర్కారుకి ఆప్త మిత్రులుగా కనిపిస్తుంటారని చురకలంటించారు.

  • Loading...

More Telugu News