ACB Court: ఓటుకు నోటు కేసు.. విచారణకు హాజరైన రేవంత్, సండ్ర, సెబాస్టియన్

ACB  Court Issued non bailable warrant to Uday sinha
  • ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం
  • తనపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చిన సండ్ర
  • గైర్హాజరైన ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌లు నిన్న ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్‌సింహ విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, తనపై మోపిన అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య తోసిపుచ్చారు. మరోపక్క, ఈ కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
ACB Court
Hyderabad
Revanth Reddy
sandra
Sebastian

More Telugu News