Corona Virus: కరోనా వైరస్‌పై వాట్సాప్‌లో దుష్ప్రచారం.. ఎలక్ట్రీషియన్ అరెస్ట్

Rachakonda cyber crime police arrest electrician for whatsapp messages

  • భయం గొల్పేలా ఉన్న వాయిస్ మెసేజ్‌లు
  • స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేసిన సాదిక్
  • అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు

కరోనా వైరస్ విషయంలో జనాన్ని భయపెట్టేలా ఉన్న మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తున్న ఓ ఎలక్ట్రీషియన్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పంపిస్తున్న మెసేజ్‌ల వల్ల అనుచిత ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా ఆదోనిలోని అమరావతినగర్‌కు చెందిన సాదిక్ బాషా (29) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్.

కరోనాకు సంబంధించి ఇటీవల అతడికి వాట్సాప్‌లో రెండు వాయిస్ మెసేజ్‌లు వచ్చాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ మెసేజ్‌లను సాదిక్ తన స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేశాడు. ఇది పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తమకు దొరికిన సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం  సాదిక్ బాషాను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు.

  • Loading...

More Telugu News