Sensex: తొలిసారి 13,700 మార్క్ ను దాటిన నిఫ్టీ

Nifty crosses 13700 mark for first time

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ
  • 224 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 58 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ తొలిసారి 13,700 మార్క్ ను దాటింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుండటంతో పాటు, కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు మొత్తం మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 46,890కి చేరుకుంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 13,741 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, కన్జ్యూమర్ గూడ్స్, రియాల్టీ, బ్యాంకెక్స్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.92%), బజాజ్ ఫైనాన్స్ (2.74%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.17%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.08%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.55%), మారుతి సుజుకి (-1.47%), టాటా స్టీల్ (-1.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.24%), బజాజ్ ఆటో (-1.18%).

  • Loading...

More Telugu News