Delhi High Court: పెళ్లి పేరుతో శారీరకంగా కలవడం రేప్ కిందకు రాదు: ఢిల్లీ హైకోర్టు
- ఇద్దరి మధ్య అన్యోన్యత ఉన్నప్పుడు రేప్ గా పరిగణించలేమన్న హైకోర్టు
- ఒక యువతి వేసిన పిటిషన్ ను కొట్టేసిన వైనం
- నిందితుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
ఒక పురుషుడితో స్త్రీ చాలా కాలంగా అన్యోన్యంగా ఉన్న పరిస్థితుల్లో... పెళ్లి పేరుతో శారీరకంగా కలవడం అత్యాచారం కిందకు రాబోదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఎక్కువ కాలం అన్యోన్యంగా ఉన్నప్పుడు... పెళ్లి చేసుకుంటానని చెప్పడం, శారీరక బంధం వైపు ప్రోత్సహించడంగా చెప్పలేమని స్పష్టం చేసింది. ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
2008లో నిందితుడితో పరిచయం ఏర్పడిందని, 3 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇచ్చాడని, దీంతో అతనితో తాను కలసి వెళ్లానని, తనపై అతను అత్యాచారం చేశాడని తన పిటిషన్ లో పేర్కొంది. అయితే, ఈ ఆరోపణల నుంచి నిందితుడికి హైకోర్టు విముక్తి కల్పించింది. దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని తెలిపింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది.