IYR Krishna Rao: పోలవరం అంచనాలను పెంచేశారని నాడు వైసీపీ ఆరోపించింది... ఇప్పుడెలా ఆమోదించమని అడుగుతున్నారు?: ఐవైఆర్

 IYR asks CM Jagan clarify Polavaram project revised estimations issue

  • పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలన్న సీఎం జగన్
  • కేంద్రానికి విజ్ఞప్తి
  • నాటి ఆరోపణలు అసత్యాలేనా? అంటూ ఐవైఆర్ స్పందన
  • సీఎం జగన్ వివరిస్తే బాగుంటుందని హితవు

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలంటూ ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. పోలవరం సవరించిన అంచనాల ప్రకారం కేంద్రమంత్రిని సీఎం జగన్ రూ.55 వేల కోట్లు కోరారని వెల్లడించారు. అందులో రూ.33 వేల కోట్లు పునరావాసానికి అంటున్నారని వివరించారు.

అయితే, అప్పటి అధికార పార్టీ తన అనుయాయులకు లబ్ది చేకూర్చే విధంగా పోలవరం అంచనాలను అమాంతం పెంచేసిందని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పెద్ద పెట్టున ఆరోపించిందని ఐవైఆర్ వెల్లడించారు. అప్పట్లో దీనిపై సాక్షి దినపత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురించారని తెలిపారు. సాక్షి ఎడిటర్ పై కొందరు అధికారులు పరువునష్టం దావాలు కూడా వేశారని వివరించారు.

మరి, నాటి ఆరోపణలన్నీ అసత్యాలేనని భావించి సీఎం జగన్ ఈ అంచనాలను ఆమోదించమని కోరారా? అని ఐవైఆర్ ప్రశ్నించారు. నాడు చేసిన ఆరోపణలకు కారణాలు వివరించి ముందుకెళితే బాగుంటుందని వైసీపీ సర్కారుకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News