USA: జో బైడెన్ సలహాదారుడికి కరోనా... ఆందోళనలో అధికారులు!

Joe Biden Aide Gets Corona

  • ఇటీవల సెడ్రిక్ తో కలిసి బైడెన్ పర్యటన
  • సెడ్రిక్ లో లక్షణాలు కనిపించడంతో పరీక్షలు
  • యూఎస్ లో ఇప్పటివరకూ 3.10 లక్షల మంది కన్నుమూత

యూఎస్ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారుడు సెడ్రిక్ రిచ్ మండ్ కు కరోనా సోకినట్టు తేలగా అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీనికి కారణం ఇటీవలి రన్ ఆఫ్ ఎన్నికల్లో బైడెన్ తోకలిసి ఆయన రిచ్ మాండ్ రాష్ట్రంలో పర్యటించడమే. ఆ వెంటనే వైద్యాధికారులు బైడెన్ నుంచి నమూనాలు స్వీకరించి, పరీక్షించగా నెగటివ్ వచ్చింది. సెడ్రిక్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పరీక్షించి, వైరస్ సోకిందని తేల్చి, 14 రోజుల క్వారంటైన్ చేశారు. బైడెన్ ను సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదుకాగా, ఇప్పటివరకూ 3.10 లక్షల మందికి పైగా మరణించారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News