Trivikram Srinivas: గుణశేఖర్ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు?

Trivikram to write dialogues for Gunashekhars movie
  • అప్పుడప్పుడు మాటలు రాస్తున్న త్రివిక్రమ్  
  • తాజాగా రెండు సినిమాలకు సంభాషణలు 
  • 'హిరణ్య కశిప' కోసం గుణశేఖర్ రిక్వెస్ట్  
  • ఇంకా ఏ విషయం చెప్పని త్రివిక్రమ్ 
త్రివిక్రమ్ శ్రీనివాస్ బేసికల్ గా రచయిత.. ఆ తర్వాతే ఆయన దర్శకుడిగా మారాడు. అందుకే, ఆయన సినిమాలలో కొన్ని సన్నివేశాలలో డైలాగుల పరంగా ఇప్పటికీ ఆ రచయితే డామినేట్ చేస్తూవుంటాడు. రచనపైన వుండే మక్కువ కారణంగానే, దర్శకుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు ఆయన కొన్ని సినిమాలకు డైలాగులు రాస్తుంటాడు.

గతంలో అలాగే, 'తీన్ మార్' సినిమాకి రాశారు. ఇప్పుడు అల్లు అరవింద్ హిందీలో నిర్మించే 'రామాయణం చిత్రానికి, పవన్ నటించే 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ చిత్రానికి కూడా సంభాషణలు రాస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో భారీ చిత్రానికి కూడా మాటలు రాయనున్నట్టు సమాచారం.

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'హిరణ్య కశిప' పేరిట భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు రాయాల్సిందిగా ఇటీవల త్రివిక్రమ్ ని గుణశేఖర్ రిక్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ విషయం చెప్పలేదని అంటున్నారు. అయితే, ఆయన రాసే అవకాశాలు ఎక్కువగానే వున్నాయని  సమాచారం.  
Trivikram Srinivas
Gunashekhar
Pawan Kalyan
Allu Aravind

More Telugu News