allu sirish: తన పెళ్లి అంటూ వస్తోన్న వార్తలను ఖండించిన యంగ్ హీరో అల్లు శిరీష్

Whenever I decide to get married I ll tell you all myself says shirish
  • తన కంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందన్న సాయితేజ్
  • త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి అని అభిమానుల్లో చర్చ
  • సాయితేజ్ సరదాగా అలా చెప్పి ఉంటాడన్న శిరీష్
  • అందరూ ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్నారని ట్వీట్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయితేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందని ఆయన చెప్పాడు. త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి జరగబోతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. పెళ్లి కూతురు ఎవరంటూ శిరీష్‌ ను అభిమానులు అడుగుతున్నారు.  

సాయితేజ్ చేసిన వ్యాఖ్యలు, నెటిజన్లు జరుపుతోన్న చర్చపై ట్విట్టర్ ద్వారా స్పందించిన అల్లు శిరీష్ తన పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సాయితేజ్ సరదాగా అలా చెప్పి ఉంటాడని, దీంతో అందరూ ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్నారని చెప్పాడు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల నుంచి తనపై ఒత్తిడి లేదని చెప్పాడు. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తానే చెబుతానని  తెలిపాడు.
allu sirish
marriage

More Telugu News