America: మోడెర్నా టీకాకు అనుమతులు ఇవ్వొచ్చు.. నిపుణుల కమిటీకి అమెరికా ఎఫ్‌డీఏ సిఫార్సు

Moderna vaccine to get FDA approval soon

  • త్వరలోనే అనుమతులు లభిస్తాయని ఆశాభావం
  • టీకా వేయించుకున్న తొలి ప్రపంచ నేతగా మైక్ పెన్స్‌కు గుర్తింపు
  • అమెరికాలో విస్తృతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం

మోడెర్నా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా ఎంఆర్ఎన్ఏ-1273కు త్వరలోనే అమెరికా ఆహార, ఔషధ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతులు లభించనున్నాయి. మోడెర్నా టీకాకు అనుమతి ఇవ్వొచ్చంటూ నిపుణుల కమిటీ ఎఫ్‌డీఏకు సిఫార్సు చేసినట్టు ఎఫ్‌డీఏ కమిషనర్ స్టీఫెన్ హన్ తెలిపారు. 18 ఏళ్లు, ఆ పైన వయసున్న వారికి ఈ టీకా పూర్తి సురక్షితమేనని కమిటీ పేర్కొంది. గతవారం ఇదే కమిటీ ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వొచ్చంటూ ఎఫ్‌డీఏకు ప్రతిపాదించగా, ఆ తర్వాత ఒక్క రోజులోనే దానికి అనుమతి లభించింది.

ప్రస్తుతం ఫైజర్ టీకాను దేశవ్యాప్తంగా విస్తృతంగా వేస్తున్నారు. నిపుణుల కమిటీ ప్రతిపాదనతో త్వరలోనే మోడెర్నాకు కూడా అనుమతులు వస్తాయని చెబుతున్నారు. అనుకున్నట్టే అనుమతులు లభిస్తే అమెరికాలో అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా మోడెర్నా రికార్డులకెక్కుతుంది.

మరోవైపు, అమెరికాలోని టెన్నెస్సీలోని ఓ ఆసుపత్రిలో ఫైజర్ టీకా తీసుకున్న నర్సు టిఫానీ డోవర్ ఆ తర్వాత కాసేపటికే అస్వస్థతకు గురికాగా చికిత్స అనంతరం కోలుకున్నారు. అలాగే, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కొవిడ్ టీకా తీసుకున్నారు. ఫలితంగా కొవిడ్ టీకా తీసుకున్న తొలి ప్రపంచనేతగా నిలిచారు.  నిజానికి తొలి టీకాను ట్రంప్ తీసుకుంటారని ప్రచారం జరిగినా ఆయన ఇప్పటి వరకు టీకా ఊసెత్తకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News