Urmila Matondkar: నన్ను, నా కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారు: ఊర్మిళ

Urmila alleges that she has been trolled for a while
  • ఇటీవలే ఊర్మిళ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్
  • తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపణ
  • తన భర్త ముస్లిం కావడమే అందుకు కారణమని వెల్లడి
  • వికీపీడియాలో తన వివరాలు తప్పుగా మార్చారని ఆవేదన
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ ఇటీవలే శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తనను, తన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా హ్యాక్ చేశారని, తన భర్త మొహిసిన్ అక్తర్ ను, ఇతర కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధిస్తున్నారని ఆరోపించారు.

తన భర్త మొహిసిన్ ఓ కశ్మీరీ ముస్లిం అని, అతను ముస్లిం కావడమే ట్రోల్స్ కు కారణమని ఊర్మిళ వెల్లడించింది. అంతేగాకుండా, వికీపీడియాలోనూ కొందరు తన కుటుంబ వివరాలను తప్పుగా పేర్కొన్నారని తెలిపారు. తన తండ్రి పేరు శివీందర్ సింగ్ అని, తల్లి పేరు రుక్సానా అహ్మద్ అని మార్చారని... కానీ తన తల్లిదండ్రుల పేర్లు సునీతా, శ్రీకాంత్ మటోండ్కర్ అని ఊర్మిళ స్పష్టం చేశారు.
Urmila Matondkar
Troll
Husband
Family Members
Shivsena

More Telugu News