Amit Shah: ఎన్నికల నాటికి టీఎంసీలో మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారు: అమిత్ షా
- పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా పర్యటన
- మమత సర్కారుపై వ్యాఖ్యలు
- హింసను ప్రేరేపిస్తే అది బీజేపీకే లాభమన్న అమిత్ షా
- వచ్చే ఎన్నికల్లో 200కి పైగా స్థానాలు గెలుస్తామని ధీమా
- సోనార్ బంగ్లా సాకారం చేస్తామని హామీ
పశ్చిమ బెంగాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాడీవేడిగా సాగుతోంది. తన వ్యాఖ్యలతో అమిత్ షా బెంగాల్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుండగా, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకత్వం రగిలిపోతోంది. ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎన్నికల నాటికి టీఎంసీలో మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారని జోస్యం చెప్పారు.
మమత సర్కారు రాష్ట్రంలో హింసను ఎంత ప్రేరేపిస్తే బీజేపీ అంత బలపడుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో 200కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో తమకు అధికారం ఇస్తే సోనార్ బంగ్లా (సువర్ణ బెంగాల్)ను సాకారం చేస్తామని అన్నారు. కాగా, ఇవాళ అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున టీఎంసీ తిరుగుబాటు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.