Radio Frequency: సుదూర రోదసి నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలు... ఏలియన్స్ కావొచ్చంటున్న పరిశోధకులు
- నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన
- 51 కాంతి సంవత్సరాల దూరం నుంచి సంకేతాలు
- భూమి వంటి గ్రహం నుంచే వస్తున్నాయన్న పరిశోధకులు
- జీవం ఉండే అవకాశం ఉందని వెల్లడి
- మరిన్ని పరిశోధనలకు ఊతం
ఏలియన్స్ (గ్రహాంతరజీవులు) గురించి చర్చ ఈనాటిది కాదు. గ్రహాంతర వాసుల ఉనికిపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, ఈ అనంత విశ్వంలో వారు ఎక్కడో ఒకచోట ఉండొచ్చన్న అంచనాలు ఎప్పట్నించో వినిపిస్తున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు. అందుకోసం అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపులు, రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలు వినిగియోస్తున్నారు.
తాజాగా, నెదర్లాండ్స్ లోని పరిశోధకులు టౌ బౌట్ అనే నక్షత్ర మండలం నుంచి కొన్ని ఉద్గార విస్ఫోటనాలను కనుగొన్నారు. ఈ సంకేతాలు రోదసిలో సౌరవ్యవస్థకు 51 కాంతి సంవత్సరాల దూరం నుంచి వస్తున్నట్టు రేడియో టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. ఈ విధమైన రేడియో మాగ్నెటిక్ సంకేతాలు రోదసి నుంచి రావడం ఇదే ప్రథమం కావడంతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది.
ఆ సంకేతాలు బహుశా భూమి వంటి ఓ గ్రహం నుంచి వస్తున్నట్టు భావిస్తున్నారు. తప్పకుండా జీవరాశి ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నెదర్లాండ్స్ సైంటిస్టులు తదుపరి కార్యాచరణకు ఉపక్రమించారు.