Hyderabad: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలిపులి.. సాధారణం కంటే తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు
- నగరంలో అంతకంతకూ పెరుగుతున్న చలి
- తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులు
- మరికొన్ని రోజులు ఇదే పరిస్థితన్న వాతావరణశాఖ
హైదరాబాద్‌లో అంతకంతకూ చలి పెరుగుతోంది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు వణుకుతున్నారు. అలాగే, సాయంత్రం నుంచి శీతల గాలులు వీస్తుండడంతో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. దీంతో రాత్రి పది గంటల తర్వాత నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
పగటి వేళలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక, శీతల గాలులకు కారణం తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు రావడమేనని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నగరంలో పరిస్థితి మరికొన్ని రోజులు ఇలానే ఉంటుందని పేర్కొన్నారు.