Bhuvaneswari: ఒంగోలులో దివ్యాంగురాలి సజీవదహనం కేసును ఛేదించిన పోలీసులు

Police reveals the burnt case of Bhuvaneswari in Ongole

  • సంచలనం సృష్టించిన భువనేశ్వరి సజీవ దహనం కేసు
  • మూడు చక్రాల సైకిల్ పైనే కాలిబూడిదైన వైనం
  • కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు
  • ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య అని స్పష్టీకరణ
  • ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితులతో చెప్పిందన్న జిల్లా ఎస్పీ


ప్రకాశం జిల్లా ఒంగోలులో భువనేశ్వరి అనే వార్డు వలంటీర్ అనుమానాస్పద స్థితిలో తన మూడు చక్రాల సైకిల్ పై సజీవదహనం కావడం తీవ్ర కలకలం రేపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందో, లేక ఎవరైనా హత్య చేసి దహనం చేశారో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు త్వరగానే ఛేదించారు. వార్డు వలంటీర్ భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు.

ఒంగోలుకు చెందిన 22 ఏళ్ల భువనేశ్వరి ఓ దివ్యాంగురాలు. పట్టణంలోని 12వ వార్డు పరిధిలో ఆమె వలంటీర్ గా వ్యవహరిస్తోంది. అయితే, గత శుక్రవారం వార్డు సచివాలయానికి వెళ్లిన ఆమె పట్టణ శివార్లలోని దశరాజుపల్లి రోడ్డు వద్ద చినవెంకన్న కుంట వద్ద మంటల్లో కాలిపోతూ కనిపించింది.

దీనిపై ఎస్పీ మాట్లాడుతూ, ఆర్థికపరమైన సమస్యలతోనే భువనేశ్వరి తనువు చాలించిందని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓలా యాప్ ద్వారా ఆమె తన స్నేహితులతో  చెప్పిందని వివరించారు.

  • Loading...

More Telugu News