Chiranjeevi: ఈ చిత్రానికి లభించే ఆదరణ సినీ రంగానికి స్ఫూర్తిని, స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు: చిరంజీవి

Chiranjeevi wishes good for Solo Brathuke So Better movie

  • క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్
  • ప్రధానపాత్రల్లో సాయితేజ్, నభా నటేశ్
  • లాక్ డౌన్ తర్వాత వస్తున్న తొలిచిత్రం అంటూ చిరు వ్యాఖ్యలు
  • ఇండస్ట్రీకి ఒక ముఖ్యమైన సందర్భమని వెల్లడి
  • ప్రేక్షకులు బాధ్యతగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి
  • భౌతికదూరం పాటిస్తూ ఎంజాయ్ చేయాలని సూచన

సాయితేజ్, నభా నటేశ్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్ రోజున థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో ఎట్టకేలకు ఓ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ ప్రత్యేక సందేశం వెలువరించారు.

"లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిలిం ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తి, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే, ప్రేక్షకులందరూ బాధ్యతగా మాస్కులు ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఈ సినిమాను థియేటర్లతో హాయిగా ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాను" అని వివరించారు.

  • Loading...

More Telugu News