South Africa: బ్రిటన్‌కు కొత్త బెడద.. ఇద్దరిలో బయటపడిన మరో కొత్త రకం కరోనా వైరస్!

New Virus shivering Britain which came from south africa

  • దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్‌లో అడుగుపెట్టిన వైరస్
  • ఇది చాలా ప్రమాదకారి అన్న మంత్రి
  • సౌతాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం
  • వారు 15 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశం

కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్‌తో బెంబేలెత్తుతున్న బ్రిటన్‌పై  ఇప్పుడు మరోటి వచ్చి పడింది. దక్షిణాఫ్రికాలో మార్పు చెందిన కొత్త రకం వైరస్ ఆ దేశంలో అడుగుపెట్టింది. ఇది చాలా ప్రమాదకారి అని, చాలా త్వరితంగా ఉత్పరివర్తన చెందుతోందని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్టు చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కరోనాకు అత్యంత వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి నుంచే ఇది దేశంలో అడుగుపెట్టి ఉంటుందని వివరించారు.

కొత్త రకం వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన లాక్‌డౌన్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు 15 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.

  • Loading...

More Telugu News