Kangana Ranaut: మతంపై మీకే సర్వాధికారాలు ఉన్నట్టు నటించొద్దు: బికినీ ఫొటోపై విమర్శలకు కంగన కౌంటర్

Bollywood Actress Kangana Ranaut strong counter to Netizens
  • తులుం దీవిలో బికినీతో ఫొటో దిగిన కంగన
  • సంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఇదేం తీరన్న నెటిజన్లు
  • అంతొద్దంటూ కౌంటర్
బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. తన బికినీ ఫొటోపై విమర్శలు చేస్తున్న వారికి ఘాటుగా జవాబిచ్చింది. మతంపై మీకే సర్వాధికారాలు ఉన్నట్టు నటించొద్దని హితవు పలికింది. మెక్సికోలోని తులం దీవిలో బికినీతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన కంగన.. తాను సందర్శించిన అద్భుతమైన ప్రదేశాలలో ఇది ఒకటని దానికి క్యాప్షన్ తగిలించింది.  బికినీలో ఉండి సముద్రం అలలను చూస్తుండగా వెనక నుంచి తీసిన ఫొటో ఇది.  

ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కంగనపై దుమ్మెత్తి పోస్తూ విమర్శల వర్షం కురిపించారు. భారతీయ విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడే నువ్వు ఇలాంటి దుస్తుల్లో కనిపించడం ఏంటంటూ దుమ్మెత్తి పోశారు. తనపై కురుస్తున్న విమర్శలపై స్పందించిన కంగన మరో పోస్టు పెట్టింది.

కొందరు వ్యక్తులు తన బికినీ ఫొటో చూసి ధర్మం, సనాతనం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేసింది. ఒకవేళ భైరవి మాత జుట్టు విరబోసుకుని, దుస్తులు లేకుండా రక్తం తాగుతూ మీ ముందుకొస్తే మీరేం చేస్తారని ప్రశ్నించింది. అప్పుడు భయపడే మీరు భక్తులుగా చెప్పుకోరా? అని ప్రశ్నించింది. కాబట్టి మతంపై మీకే సర్వాధికారాలు ఉన్నట్టు నటించవద్దని హితవు పలికిన కంగన.. జై శ్రీరామ్ అని ముగించింది.
Kangana Ranaut
Bollywood
Bikini Photo

More Telugu News