Sathya Yesu Babu: ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు: జిల్లా ఎస్పీ

Ananthapur SP responds over JC Prabhakar Reddy and Kethireddy issue
  • తాడిపత్రిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
  • జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం దాడి
  • స్పందించిన జిల్లా ఎస్పీ
  • బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి  వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో రావడం.. అక్కడ ఇరువర్గాలు బాహాబాహీకి తలపడడం.. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు స్పందించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని వెల్లడించారు.

అలా వైరల్ చేస్తున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లారని వివరించారు. తాడిపత్రి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటు, ధర్మవరంలో యువతి హత్య ఘటన వివరాలను కూడా ఎస్పీ మీడియాతో పంచుకున్నారు. ఈ ఉదంతంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోలేదన్న ఆరోపణలపైనా విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Sathya Yesu Babu
SP
Anantapur District
JC Prabhakar Reddy
Kethireddy
Tadipatri
YSRCP
Telugudesam

More Telugu News