Zarda Pulav: ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులకు వేడివేడి జర్దా పులావ్ వడ్డించిన ముస్లింలు

Maler Kotla muslims serves Zarda Pulav for farmers

  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
  • ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుత ప్రదర్శనలు
  • పంజాబ్ లోని మలేర్ కోట్లా నుంచి వచ్చిన ముస్లింలు
  • రైతులకు సంఘీభావం
  • అన్నదాతల కడుపునింపడం తమ ధర్మమని వ్యాఖ్యలు

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే, రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ పంజాబ్ లోని మలేర్ కోట్లా ప్రాంతం నుంచి కొందరు ముస్లింలు ఢిల్లీ సరిహద్దులోని సింఘు ప్రాంతానికి వచ్చారు.

నిరసనలు తెలుపుతున్న రైతుల కోసం వారు రుచికరమైన జర్దా పులావ్ ను వండి వడ్డించారు. గత నవంబరు 26 నుంచే తాము రైతులకు ఆహార పదార్థాలు అందిస్తున్నామని మలేర్ కోట్లాకు చెందిన హాజీ మహ్మద్ జమీల్ వెల్లడించారు. జర్దా పులావ్ ప్రధానంగా శాకాహార వంటకం అని, తీపి, ఉప్పుల సమ్మిళితంగా దీని రుచి ఉంటుందని తెలిపారు. రైతులు దేశానికి అన్నదాతలని, ఇలాంటి సమయాల్లో వారి కడుపు నింపడం తమ ధర్మం అని వివరించారు.

  • Loading...

More Telugu News