Chetan Sharma: బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా చేతన్ శర్మ
- ఎమ్మెస్కే పదవీకాలం ముగియడంతో కొత్త నియామకం
- చేతన్ శర్మ, కురువిల్లా, మొహంతీలకు సెలెక్టర్లుగా చాన్స్
- అనుభవం ప్రాతిపదికన చేతన్ శర్మకు చైర్మన్ బాధ్యతలు
- ఈ మేరకు సిఫారసు చేసిన సీఏసీ
భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నియమితుడయ్యాడు. ఇటీవల చీఫ్ సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ముగియగా, మరో ఇద్దరు సెలెక్టర్ల స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. దాంతో, బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) తాజాగా ముగ్గుర్ని సెలెక్టర్లుగా సిఫారసు చేసింది. చేతన్ శర్మ, అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతీల పేర్లను ప్రతిపాదించింది. ఈ సిఫారసులకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఇక, సెలక్షన్ కమిటీలో అత్యధిక టెస్టులు ఆడిన చేతన్ శర్మను అనుభవం ప్రాతిపదికన భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించారు. కాగా, ఇప్పటికే సెలెక్షన్ కమిటీలో సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.