Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ పై ఐదేళ్ల నిషేధం!
- 2018 విద్యా సంవత్సరంలో బీ++ గ్రేడ్ కేటాయించిన న్యాక్
- గ్రేస్ పెంచుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్లు పంపిన కాలేజీ యాజమాన్యం
- అక్రిడేషన్ పై ఐదేళ్ల నిషేధం విధించిన న్యాక్
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) షాకిచ్చింది. హైదరాబాదులోని కొంపల్లిలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ పై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్ సైట్లో ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే, మల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ కి 2018 విద్యా సంవత్సరంలో న్యాక్ బీ++ గ్రేడ్ ను కేటాయించింది. అయితే, ఈ గ్రేడ్ ను అధిగమించి మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశంతో కాలేజీ మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. న్యాక్ బెంగళూరుకు నకిలీ డాక్యుమెంట్లను పంపారు. ఈ విషయాన్ని పసిగట్టిన న్యాక్ కౌన్సిల్ అధికారులు కాలేజ్ యాజమాన్యం మోసానికి పాల్పడిందని చర్యలు చేపట్టారు. అక్రిడేషన్ విషయంలో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇదే విషయాన్ని తన వెబ్ సైట్ లో న్యాక్ పొందుపరిచింది. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.