Vijay Sai Reddy: అప్పట్లో చంద్రబాబు రిషితేశ్వరి కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశాడు: విజయసాయిరెడ్డి

vijaya sai slams chandrababu

  • స్టూడెంట్ రిషితేశ్వరి చనిపోతే అప్పట్లో విచారణ చేపట్టలేదు
  • స్నేహలత విషయంలో ఇప్పుడు సమగ్ర విచారణ
  • ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం
  • విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు?

అనంతపురం బాలిక స్నేహలత హత్యకు గురైన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఏఎన్యూ స్టూడెంట్ రిషితేశ్వరి చనిపోతే విచారణ చేపట్టకపోగా, చంద్రబాబు రిషితేశ్వరి కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశాడు. స్నేహలత విషయంలో వైఎస్ జగన్ గారు సమగ్ర విచారణకు ఆదేశించటమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉండి, అన్ని విధాలా ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలిపారు.

విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు?  అంటూ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీపై ఆరోపణలు గుప్పించారు. ‘వైసీపీ వస్తే రాయలసీమ రౌడీలు మీ  భూములను ఆక్రమిస్తారు. మీ ఇంటి నుంచి మిమ్మల్ని గెంటేస్తారని ఎన్నికలప్పుడు బాబు దిగజారి మరీ  దుష్ప్రచారం చేశాడు. బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన రాయపాటి ఎవరు? విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు?  మీవాళ్లేగా బాబూ!’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News