Ranveer Singh: "బిగ్ బ్రదర్" అంటూ సంబోధించిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్... స్పందించిన మహేశ్ బాబు!

Ranveer Singh responds over the collaboration with Mahesh Babu
  • ఇటీవల ముంబయిలో యాడ్ ఫిలిం షూట్
  • యాడ్ లో కలిసి నటించిన మహేశ్ బాబు, రణవీర్ సింగ్
  • మహేశ్ ను జెంటిల్మన్ గా పేర్కొన్న బాలీవుడ్ హీరో
  • మన ఇద్దరిదీ ఒకటే భావన అంటూ మహేశ్ వ్యాఖ్యలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వ్యక్తిత్వానికి బాలీవుడ్ అగ్రహీరో రణవీర్ సింగ్ ఫిదా అయ్యాడు. వీరిద్దరూ కలిసి ఇటీవల ముంబయిలో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, మహేశ్ బాబును జెంటిల్మన్ గా పేర్కొన్నాడు. అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరైన మహేశ్ బాబు గారితో కలిసి పనిచేసే భాగ్యం దక్కిందని పేర్కొన్నాడు. మనం మాట్లాడుకున్న సందర్భాలు ఎల్లప్పటికీ విలువైనవి. 'బిగ్ బ్రదర్' మహేశ్ గారికి నా ప్రేమాభిమానాలు అని రణవీర్ పోస్టు చేశాడు. దీనికి మహేశ్ బాబు స్పందించాడు. సోదరా... నీతో కలిసి పనిచేయడాన్ని గొప్పగా భావిస్తున్నాను. మన ఇద్దరిదీ ఒకటే భావన అని పేర్కొన్నాడు.
Ranveer Singh
Mahesh Babu
Ad Film Shooting
Mumbai

More Telugu News