Gorantla Butchaiah Chowdary: అంపకాల గురించి మీరు మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉంది... మీ చిట్టా ప్రజలకు తెలుసు: సోము వీర్రాజుకు గోరంట్ల కౌంటర్

Gorantla counters Somu Veerraju comments on special status issue
  • గోరంట్ల, సోము మధ్య మాటలయుద్ధం
  • ప్రత్యేక హోదా అంశంలో విమర్శల పర్వం
  • ప్యాకేజికి చంద్రబాబు ఒప్పుకున్నారన్న సోము
  • హోదాపై వైఖరి స్పష్టం చేయాలని గోరంట్ల డిమాండ్
ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రత్యేక హోదా అవసరంలేదంటూ చంద్రబాబు అర్ధరాత్రి ప్యాకేజికి ఒప్పుకున్నారని, ప్యాకేజి ద్వారా నిధులిస్తే వాటిని ఏవిధంగా అంపకాలు చేసుకున్నారో ప్రజలకు తెలుసని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దీనిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా బదులిచ్చారు.

అంపకాలు, పంపకాలు గురించి మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది, మీ చిట్టా ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అవసరం లేదు అని తామెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.  "నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదని చెప్పింది మీరు. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, కేంద్రం ఏపీకి అన్యాయం చెయ్యదని చెప్పింది మీరు. కానీ చెప్పిన విధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ కు సరైన ప్యాకేజి ఇవ్వలేకపోయింది. ఆ పరిస్థితుల్లోనే ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం జరిగింది" అని గోరంట్ల వివరణ ఇచ్చారు.

ఇంతకీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ-వైసీపీ వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Gorantla Butchaiah Chowdary
Somu Veerraju
AP Special Status
Andhra Pradesh
Chandrababu
Telugudesam
BJP
YSRCP

More Telugu News