Bandi Sanjay: కేసీఆర్ ఒక యూటర్న్ ముఖ్యమంత్రి: బండి సంజయ్

Bandi Sanjay called KCR as U Turn CM

  • యూరియా ఫ్రీగా ఇస్తానని యూటర్న్ తీసుకున్నాడు
  • కేసీఆర్ తుగ్లక్ ను మించిపోయాడు
  • కొనుగోలు కేంద్రాలను తీసివేయడంలో అర్థం ఏముంది

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పూజ్యులు, గౌరవనీయులు, తమ గురువర్యులైన కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. యూరియా ఫ్రీగా ఇస్తానని చెప్పి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాడని విమర్శించారు. కరోనాలేదు, కాకరకాయ లేదు, పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుందని చెప్పాడని... ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాడని దుయ్యబట్టారు. రైతు చట్టాల విషయంలో యూటర్న్ తీసుకున్నాడని అన్నారు. తుగ్లక్ ని కూడా కేసీఆర్ మించిపోయాడని చెప్పారు. ఇన్ని యూటర్న్ లు తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.

కేసీఆర్ ఏం చేసినా అబద్ధాల ముఖ్యమంత్రి ఏదో కుట్ర చేస్తున్నాడా? అనే అనుమానాలు వస్తాయని సంజయ్ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలను తీసివేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. రైతు వేదికల ఏర్పాటులో కేంద్రం నిధులు కూడా ఉన్నాయని... రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు వ్యాపారం చేశామని కేసీఆర్ ఒప్పుకున్నాడని అన్నారు. బ్రోకరిజం చేశావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంతో కొత్త కుట్రలకు కేసీఆర్ తెరలేపినట్టు అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News