Andhra Pradesh: స్థానిక ఎన్నికలపై సర్కారుకు డెడ్ లైన్ విధించిన ఏపీ హైకోర్టు

AP High Court issues fresh orders to AP Government over local body elections

  • ఎస్ఈసీతో చర్చలు జరపాలని స్పష్టీకరణ
  • ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని వెల్లడి
  • మూడ్రోజుల్లోపు అధికారులను పంపాలని ఆదేశాలు
  • చర్చలకు వేదికను ఎస్ఈసీ నిర్ణయించాలని సూచన

స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ఏపీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్ ప్రతులు అందిన మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని ఆదేశించింది.

 ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ను కలిసి స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని విడమర్చి చెప్పాలని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎస్ఈసీకి తెలపాలని వివరించింది. అందుకు, ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చేలా మూడ్రోజులు గడువు విధిస్తున్నట్టు న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

అంతేకాదు, త్వరలోనే ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో ప్రభుత్వానికి వివరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా, ఈ చర్చలకు వేదికను ఎన్నికల సంఘం నిర్ణయించాలని సూచించింది.

  • Loading...

More Telugu News