Corona Virus: దేశంలో కొత్తగా 16,432 కరోనా కేసులు... ఊరట కలిగించేలా రికవరీ రేటు
- భారత్ లో తగ్గుముఖం పడుతున్న కరోనా
- కరోనా నుంచి కోలుకున్న వారు 24,900 మంది
- అదే సమయంలో 252 మంది మృతి
- 95.92 శాతానికి పెరిగిన రికవరీ రేటు
- 1.45 శాతానికి తగ్గిన మరణాల రేటు
కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కలకలాన్ని మినహాయిస్తే, భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 16,432 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 24,900 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 252 మంది మరణించారు.
ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,24,303కి చేరింది. ఇప్పటివరకు 98,07,569 మంది కోలుకోగా, ఇంకా 2,68,581 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 1,48,153కి పెరిగింది. కాగా, భారత్ లో రికవరీ రేటు 95.92 శాతానికి పెరగడం ఊరట కలిగిస్తోంది. అదే సమయంలో మరణాల రేటు 1.45 శాతానికి తగ్గింది.