Sathyanarayana Rao: రజనీకాంత్ నిర్ణయంపై సోదరుడు సత్యనారాయణరావు స్పందన

Sathyanarayana Rao responds over his brother Rajinikanth decision not to enter politics

  • ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్
  • పార్టీ పెట్టలేనన్న స్పష్టీకరణ
  • తమ్ముడి నిర్ణయాన్ని స్వాగతించిన అన్న
  • రజనీని ఎవరూ ఒత్తిడి చేయలేరని వెల్లడి

ఇటీవలే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకున్న సంగతి తెలిసిందే. తాను పార్టీ పెట్టబోవడంలేదని రజనీకాంత్ ఇవాళ స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిపై రజనీ సోదరుడు సత్యనారాయణరావు (77) స్పందించారు. తన తమ్ముడి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అనారోగ్యం వల్ల పార్టీ నెలకొల్పలేకపోతున్నట్టు రజనీ ప్రకటించడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా రాజకీయ పార్టీ విషయంలో రజనీని ఎవరూ ఒత్తిడి చేయలేరని, అది ఆయన ఇష్టమని పేర్కొన్నారు. రజనీ పార్టీ పెడతాడని తాము సైతం ఎదురుచూస్తున్నామని, కానీ అనారోగ్యం అని చెప్పిన తర్వాత బలవంతం చేయలేమని వెల్లడించారు. తన తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటాడని తెలిపారు. నిన్ననే రజనీతో మాట్లాడానని సత్యనారాయణరావు వెల్లడించారు.

అటు, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా రజనీకాంత్ ప్రకటనపై స్పందించారు. రాజకీయాల్లోకి రాకూడదని రజనీకాంత్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, హిందువు అయినా రజనీలో సెక్యులర్ భావాలు ఉన్నాయని తెలిపారు. రజనీకాంత్ తనకు చాలా ఏళ్లుగా స్నేహితుడని, ఆయన రాజకీయాల్లోకి రానందుకు సంతోషిస్తున్నానని చిదంబరం తెలిపారు. నేరుగా రాజకీయాల్లోకి రావొద్దని రజనీకాంత్ కు 1996లోనే చెప్పానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News