Upasana: ప్రస్తుతానికి నెగెటివ్... పాజిటివ్ రావొచ్చేమో!: ఉపాసన కొణిదెల

Upasana says the she was tested corona negative
  • రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
  • తాను కూడా టెస్టు చేయించుకున్నట్టు ఉపాసన వెల్లడి
  • నెగెటివ్ వచ్చిందంటూ ట్వీట్
  • రామ్ చరణ్ కోలుకుంటున్నాడని వివరణ
  • హోంక్వారంటైన్ లో ఉన్నట్టు స్పష్టీకరణ
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల తన ఆరోగ్య స్థితిపై అప్ డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అని వెల్లడైన నేపథ్యంలో తాను కూడా కరోనా టెస్టులు చేయించుకున్నానని ఉపాసన తెలిపారు. కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతానికి లక్షణాలేవీ లేవని స్పష్టం చేశారు. అయితే తనకు కరోనా పాజిటివ్ వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ఇప్పుడు మిస్టర్ సి (రామ్ చరణ్) తో కలిసి హోం క్వారంటైన్ లో ఉన్నానని, మిస్టర్ సి బలంగా పుంజుకుంటున్నారని ఉపాసన వెల్లడించారు. వేడి వేడి ద్రవాలు, ఆవిరి పట్టడం, విశ్రాంతి తీసుకోవడంతో సరిపోతోందని వివరించారు.  అంతేకాదు, రామ్ చరణ్ తో కలిసి ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు.
Upasana
Corona Virus
Negative
Ramcharan
Positive
Home Quarantine

More Telugu News