winter: తెలంగాణలో తగ్గుతున్న చలి.. రాత్రి వేళ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

 Decreasing cold in Telangana

  • క్రమంగా తగ్గుతున్న చలి
  • పలు ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు
  • గిన్నెధరిలో అత్యల్పంగా 10.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

గత కొన్ని రోజులుగా తెలంగాణను వణికిస్తున్న చలి గత మూడు రోజులుగా నెమ్మదించింది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో చలి తీవ్రత తగ్గుతోంది. చాలా ప్రాంతాల్లో రాత్రివేళ మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10, 11 డిగ్రీలుగా నమోదవుతోంది. కుమురం భీం జిల్లాలోని గిన్నెధరిలో నిన్న అత్యల్పంగా 10.1 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్  జిల్లాలోని సోనాలలో 10.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుభీర్‌లో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ అధికంగా ఉండడం, ఉదయం పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండడంతో ఆ సమయంలో చలి తీవ్రత ఉంటోంది.

  • Loading...

More Telugu News