UK: బ్రిటన్​ విమానాలు జనవరి 7 దాకా బంద్​

India extends suspension of UK flights till January 7 amid worries over new coronavirus strain

  • సర్వీసుల రద్దును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
  • అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచనలు
  • ఆ తర్వాత పరిమిత సంఖ్యలో విమానాలకు అవకాశం

బ్రిటన్ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే విమాన సర్వీసుల రద్దును కేంద్రం పొడిగించింది. 2021 జనవరి 7 వరకు రాకపోకలను నిలిపేస్తూ  బుధవారం ఉత్తర్వులిచ్చింది.  

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఉత్తర్వులను జారీ చేశారు. జనవరి 7 తర్వాత కఠినమైన ఆంక్షల నడుమ విమాన సర్వీసులను పునరుద్ధరించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతినివ్వాలని సూచించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఆరోగ్య శాఖతో చర్చించి పౌర విమానయాన శాఖ ఖరారు చేస్తుందని తెలిపింది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) నేతృత్వంలోని సంయుక్త పర్యవేక్షణ బృందం (జేఎంజీ), ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని నేషనల్ టాస్క్ ఫోర్స్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య విభాగం) సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, అంతకుముందు డిసెంబర్ 31 దాకా బ్రిటన్ విమానాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News