Jio: జియో యూజర్లకు శుభవార్త... జనవరి 1 నుంచి ఇతర నెట్వర్క్ లకు కూడా ఉచిత కాల్స్
- జియో నూతన సంవత్సర కానుక
- దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్ సదుపాయం
- జియో నుంచి ఏ నెట్వర్క్ కైనా ఫ్రీ కాల్స్
- ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలు తొలగించామన్న జియో
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన వినియోగదారులకు నూతన సంవత్సర కానుక అందిస్తోంది. 2021 జనవరి 1 నుంచి జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని శుభవార్త చెప్పింది. ఇకపై జియో నుంచి జియోకు మాత్రమే కాకుండా, దేశీయంగా అన్ని ఇతర కంపెనీల నెట్వర్క్ లకు కూడా ఉచితంగా కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు జియో ఇవాళ ప్రకటించింది.
ఇప్పటివరకు జియో సిమ్ నుంచి ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ తదితర సిమ్ లకు కాల్ చేయాలంటే చార్జీ చెల్లించాల్సి వచ్చేది. అయితే, దేశవ్యాప్తంగా ఇకపై జియో సిమ్ నుంచి ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని, తద్వారా భారత్ ఫ్రీ వాయిస్ కాల్స్ దేశంగా మారుతుందని ఈ టెలికాం దిగ్గజం పేర్కొంది. ట్రాయ్ సూచనల మేరకు దేశీయంగా వాయిస్ కాల్స్ పై ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలు ఎత్తివేస్తున్నామని ఈ సందర్భంగా జియో వర్గాలు తెలిపాయి.