Chiranjeevi: చిరంజీవి మద్దతివ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాం: ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ

Chiranjeevi supports AIG End Corona Campaign

  • ఎండ్ కరోనా అంటూ ఏఐజీ పిలుపు
  • వీడియో సందేశంతో మద్దతు పలికిన చిరంజీవి
  • ఏఐజీ వర్చువల్ క్యాంపైన్ కు మీరూ మద్దతివ్వాలని సూచన
  • స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి వెళదామని వ్యాఖ్యలు

కరోనాను అంతం చేద్దాం అంటూ ప్రముఖ వైద్య సంస్థ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) పిలుపునిస్తోంది. ఈ మేరకు వివిధ విభాగాల్లో సుహృద్భావ పరుగు, నడక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందుకోసం ఏఐజీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండగా, వారికి మెగాస్టార్ చిరంజీవి కూడా జత కలిశారు. కరోనా తుదముట్టిద్దాం అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.

"గత 9 నెలలకు పైగా తీవ్ర భయాందోళనల నడుమ కాలం గడిపామని వెల్లడించారు. నిర్భయంగా బతికేందుకు అందరం ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చేసింది. నిర్బంధం నుంచి, నిస్సహాయత నుంచి, భయం నుంచి స్వేచ్ఛలోకి అడుగుపెడదాం. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా సురక్షితమైన వ్యాక్సిన్. ఈ క్రమంలో మీరు కూడా నాతో కలవండి. కరోనాను అంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన ఏఐజీ వారి వర్చువల్ ప్రచారంలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మనందరం కలిసి సరికొత్త స్వేచ్ఛాయుత ప్రపంచానికి స్వాగతం పలుకుదాం" అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News