Proddutur: సుబ్బయ్య హత్యతో నాకు సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి

YSRCP MLA says he does not have contact with Subbaiah murder
  • ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్య
  • స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు
  • హత్యతో సంబంధం లేదని చౌడేశ్వరి అమ్మవారి పాదాల మీద ప్రమాణం
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ హత్యతో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన ప్రొద్దుటూరులోని చౌడేశ్వరి అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేశారు.

సుబ్బయ్య హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. హత్యతో ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని తనకు సంబంధం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తాను భయపడనని అన్నారు. మృతుడు సుబ్బయ్య కుటుంబానికి తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. హత్య కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Proddutur
Subbaiah
Telugudesam
YSRCP
MLA
Siva Prasad Reddy

More Telugu News