Australia: ఆస్ట్రేలియా జాతీయ గీతంలో మార్పులు.. ఎందుకో చెప్పిన ప్రధాని స్కాట్​ మోరిసన్​

Australia has changed its national anthem in a bid to reflect 60000 years of Indigenous history

  • అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్ మొదటి వరుసలో మార్పులు
  • పూర్వీకుల గొప్పదనాన్ని తెలిపేలా గీతంలో అదనపు పదాలు
  • యువ దేశమే అయినా.. తమకూ పురాతన చరిత్ర ఉందన్న స్కాట్

కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్లాన్ చేసింది ఆస్ట్రేలియా. జనానికి కొత్త షాకిచ్చింది. జాతీయ గీతం ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’ను కొద్దిగా మార్చింది. దేశ పురాతన చరిత్ర, దేశీ తెగల గొప్పతనాన్ని వివరించేలా గీతాన్ని మార్చారు. 2021లోకి అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే జాతీయ గీతంలో మార్పులు చేశారు. గీతంలోని మొదటి లైన్ లోనే ‘యంగ్ అండ్ ఫ్రీ’ని ‘వన్ అండ్ ఫ్రీ’గా మార్చింది.

జాతీయ గీతంలో మార్పులపై ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ఆ దేశానికి చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కు రాసిన వ్యాసంలో జాతీయ గీతాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు. ఆస్ట్రేలియా ఆధునిక, యువ దేశమే అయి ఉండొచ్చని, కానీ, తమకూ పురాతన చరిత్ర ఉందని అన్నారు.

తమ పూర్వీకులు దేశాన్ని నడిపిన తీరు, గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియచెప్పేందుకే జాతీయ గీతంలో మార్పులు చేశామన్నారు. ఈ నిజాన్ని గుర్తించి అందరూ ఆదరించాలని, ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మొదటి వరుసలో మార్పు వల్ల.. జాతీయ గీతం మరింత బలంగా తయారైందన్నారు.

అయితే, ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని మార్చడం ఇది తొలిసారేం కాదు. అంతకుముందు 1878లో పీటర్ డాడ్స్ మెక్ కార్మిక్స్ రాసిన ఒరిజినల్ గీతమే అధికారిక జాతీయ గీతమంటూ 1984లో ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. అప్పటికి ఉన్న ‘గాడ్ సేవ్ ద క్వీన్’ అనే జాతీయ గీతాన్ని పక్కన పెట్టేసింది.

  • Loading...

More Telugu News