Sensex: కొత్త ఏడాదిని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు

Stock markets starts new year with profits

  • 118 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఐటీసీ, టీసీఎస్

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు కొంతమేర లాభాల స్వీకరణకు పాల్పడటంతో, లాభాలు తగ్గిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 47,869కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 14,019 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.32%), టీసీఎస్ (2.02%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.67%), భారతి ఎయిర్ టెల్ (1.14%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.36%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.83%), టైటాన్ కంపెనీ (-0.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.34%), బజాజ్ ఫైనాన్స్ (-0.30%).

  • Loading...

More Telugu News