New Delhi: 15 ఏళ్ల తరువాత ఢిల్లీలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత... 1.1 డిగ్రీలకు వేడిమి!

New Delhi Record 1 degree Celsius

  • 2006 తరువాత అతి తక్కువ ఉష్ణోగ్రత
  • దట్టమైన పొగమంచుతో శూన్యానికి విజబిలిటీ
  • వెల్లడించిన ఐఎండీ హెడ్ కులదీప్ శ్రీవాత్సవ

దాదాపు 15 సంవత్సరాల తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. శనివారం నాడు సఫ్దర్ గంజ్ లాబొరేటరీ 1.1 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది. 2006, జనవరి 8న 0.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తరువాత ఇంత తక్కువ వేడిమి నమోదుకావడం ఇదే తొలిసారి. గత సంవత్సరం జనవరిలో 2.4 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయిందని గుర్తు చేసిన ఐఎండీ (ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్) హెడ్ కులదీప్ శ్రీవాత్సవ, నగర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుని ఉందని అన్నారు.

పొగమంచు కారణంగా విజబిలిటీ శూన్యమైందని తెలిపిన ఆయన, కనీసం 50 మీటర్ల దూరంలోని వాహనాలను సైతం చూసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు ఉష్ణోగ్రతను కనిష్ఠానికి చేర్చాయని, ఈ పరిస్థితి 6వ తారీకు వరకూ ఉంటుందని ఆ తరువాత ఉష్ణోగ్రత 8 డిగ్రీల వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. వేడి పెరిగినా, చలి తీవ్రత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News