Muradnagar: యూపీలో విషాదం... శ్మశానంలో 21 మంది దుర్మరణం

Fifteen died in Uttarpradesh cremation ground

  • ఇటీవల కన్నుమూసిన రామ్ ధన్ అనే వ్యక్తి
  • అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకొచ్చిన వైనం
  • షెల్టర్ కింద నిల్చున్న బంధువులు
  • ఒక్కసారిగా కూలిపోయిన షెల్టర్ పైకప్పు
  • ఘటనపై దిగ్భ్రాంతి చెందిన సీఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ లోని మురాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన 21 మంది శ్మశానంలో మృత్యువాత పడ్డారు. శ్మశానంలో ఉన్న ఓ షెల్టర్ పైకప్పు కూలిపోవడంతో వారు మరణించారు. మురాద్ నగర్ కు చెందిన రామ్ ధన్ అనే వ్యక్తి కన్నుమూయడంతో ఆయన మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకొచ్చారు.

అంతిమ క్రియలు జరుగుతుండగా, అక్కడికి వచ్చిన బంధువులు వర్షం పడుతుండడంతో ఓ షెల్టర్ కింద నిల్చున్నారు. ఇంతలో షెల్టర్ కప్పు ఒక్కుదుటున కూలిపోయింది. 15 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పట్టణంలోని ఆసుపత్రుల్లో చేర్చారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు ప్రాణాలు విడిచారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News