Vellampalli Srinivasa Rao: ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవని వాళ్లు కూడా చాలెంజ్ లు విసరడం హాస్యాస్పదంగా ఉంది: మంత్రి వెల్లంపల్లి

Vellampalli Srinavasa Rao comments on opposition parties
  • విపక్షాలపై మండిపడిన మంత్రి వెల్లంపల్లి
  • రాజకీయ లబ్దికోసం దేవుళ్లను వాడుకుంటున్నారని వ్యాఖ్యలు
  • ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
  • పవన్ తో కలవడం ద్వారా బీజేపీ విలువ కోల్పోయిందని వెల్లడి
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విపక్షాలపై మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసం దేవుళ్లను వాడుకోవడాన్ని సహించమని స్పష్టం చేశారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు పార్టీలు ఇటీవల జరిగిన రామతీర్థం సంఘటనను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పార్టీలు సవాళ్లు విసురుతుండడం హాస్యాస్పదంగా ఉందంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో కలిసిన తర్వాత బీజేపీ తన విలువను కోల్పోయిందని వెల్లంపల్లి విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Vellampalli Srinivasa Rao
Opposition Parties
Ramatheertham
BJP
Janasena
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News