vaccine: వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణలో 1,500 కేంద్రాల ఏర్పాటు

shoul take two shots of vaccine

  • భార‌త్ లో త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ పంపిణీ 
  • వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుత టీకాలు  
  • రెండు డోసులు వేసుకొంటేనే రోగనిరోధక శక్తి  

భార‌త్ లో త్వ‌ర‌లోనే క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ అంద‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే భార‌త్ లో అత్య‌వ‌స‌ర వినియోగానికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌కు డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్‌ల పంపిణీకి కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణలో 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ చెప్పింది. మొద‌ట‌ వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుత టీకాలు వేస్తామని చెప్పింది.

అయితే, రెండు డోసులు వేసుకొంటేనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. రెండో డోసు వేసుకున్న అనంత‌ర‌మే క‌రోనా నుంచి పూర్తి రక్షణ కల్పించేలా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలోనే దేశంలో వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చార‌ని ఐసీఎంఆర్ సంచాల‌కుడు బల్‌రామ్‌ భార్గవ తెలిపారు.

  • Loading...

More Telugu News